NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు నగర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్

1 min read

వైసీపీకి మళ్లీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు.. అభివృద్ధికి అడ్డుపడతారు తప్ప చేసేదేమీ లేదు.. మంత్రి టీజీ భరత్

కర్నూలు, న్యూస్ ​నేడు: కర్నూలు నగరంలోని బీక్యాంప్‌లో ఉన్న గర్ల్స్ హైస్కూల్ గ్రౌండ్‌లో వాకర్స్‌తో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని సంస్కృతి పార్కులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి స్థానికులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంతో పాటు కర్నూలు నగర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నగర అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించడంతో పాటు, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను కూడా ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మంత్రి విమర్శించారు. 2024 ఎన్నికల్లోనే ప్రజలు వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలను ఇచ్చి తమ తీర్పును స్పష్టంగా చెప్పారన్నారు. అయినప్పటికీ మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులు గెలిచినా నగరానికి ఒరిగేదేమీ ఉండదని, అభివృద్ధికి అడ్డుపడటం తప్ప వారు చేసేదేమీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలు ఆలోచించి నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *