పూలుకుంటలో జడ్పిటిసి అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు గడపగడపకు ఎన్నికల ప్రచారం!
1 min read
గ్రామాలలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు
కూటమి నేతలకు పూలదండలు మంగళహారతులతో జననీరాజనం
అన్నమయ్య జిల్లా (సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలోని పూలు కుంట, బోరెడ్డిగారిపల్లి గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది. సీతారామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాలివీడు జడ్పిటిసి అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు , తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి తో కలిసి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజల ఆత్మీయ పలకరింపులు… మహిళల మంగళహారతులు… పూలదండలతో ఘన స్వాగతాలు… కార్యకర్తల నినాదాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో నాయకులు ముందుకు సాగారు.అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం… ప్రజల ఆకాంక్షలే ప్రాధాన్యం!రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నాయకులు ప్రచారాన్ని కొనసాగించారు.పాలకొండరాయుడు కుటుంబ వారసత్వం… ప్రజలతో విడదీయలేని అనుబంధం… గాలివీడు అభివృద్ధే లక్ష్యం గా పని చేస్తామన్నారు.ప్రజల ఆదరాభిమానాల మధ్య సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నవంబర్ 5, 2026 గురువారం జరిగే ఎన్నికల రోజున గాలివీడు మండల ప్రజలు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, వేయించి, తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.



