NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రీయ ఏక్తా దివాస్ – రన్ ఫర్ యూనిటీ…

1 min read

జాతీయ సమైక్యత పరుగును జెండా ఊపి ప్రారంభించిన …

ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ .

కర్నూలు, న్యూస్​  నేడు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా రన్ ఫర్ యూనిటీ.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా శుక్రవారం కర్నూలు నగరంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత పరుగును నిర్వహించారు.ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం- కర్నూల్  కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమైన పరుగు కంట్రోల్ రూమ్ మీదుగా తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది.దేశ సమైక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ డీఎస్పీ శ్రీ భాషా, ఆర్ఐ శ్రీ పోతల రాజు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *