మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం
1 min read
పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం
మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి డా. అప్సర్ షరీఫ్
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ప్రచారం చివరి రోజు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్, మైనారిటీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.కె. బాషా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణం లోని వివిధ ప్రాంతాల్లో పర్య టించి ఓటర్లను నేరుగా కలుసు కున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి గల కారణాలను, పట్టణ అభివృద్ధికి సంబంధించిన తమ ప్రణాళికలను ప్రజలకు వివ రించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.పట్టణంలో పారి శుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, మౌలిక సదుపా యాల కల్పన, మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తా మని వారు తెలిపారు. పట్టణం లోని అన్ని ప్రాంతాలను సమాన ప్రాధాన్యత తో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొ న్నారు. ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తా మని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతా యుత మైన పాలన అందించేందుకు కృషి చేస్తామని అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్, డాక్టర్ ఎస్.కె. బాషా లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


