NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో 2,52,397మంది ఫించన్ దారులకు 111.04కోట్ల రూ.పంపిణీ చేస్తున్నాం

1 min read

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి 

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో 2,52,397మంది ఫించన్ దారులకు 111.04కోట్ల రూపాయిలు పంపిణీ  చేస్తున్నామని  చేస్తున్నామని  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  చెప్పారు.  స్థానిక ఫిరంగులదిబ్బ ప్రాంతంలోని  కగ్గా అంకులమ్మ ,గండికోట పాపమ్మ, గండికోట వీర్రాజమ్మ, తదితర లబ్ధిదారుల ఇంటికి   శుక్రవారం  వెళ్లి  పెన్షన్ అందజేశారు. గండికోట అంజమ్మ ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా లో 4916 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటు చేయడమైనదన్నారు. పెన్షన్దారులందరికీ పెన్షన్ అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, 30 వ తేదీన పెన్షన్ తీసుకోనివారికి 5వ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,డిఆర్డిఏ పీడీ  విజయలక్ష్మి ,ఏలూరు తహసీల్దార్,వార్డ్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *