కేజిబివి కౌతాళంలో ప్రపంచ మానసిక ఆరోగ్య మాసోత్సవం ఘనంగా నిర్వహణ
1 min read
కౌతాళం, న్యూస్ నేడు అక్టోబర్ 30: కౌతాళంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన ప్రపంచ మానసిక ఆరోగ్య మాసోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ L. చంద్ర శేఖర్ విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, ఒత్తిడిని అధిగమించే మార్గాలు, ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.అనంతరం పాఠశాల ప్రత్యేక అధికారిణి మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థినులు చదువుతో పాటు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులతో తమ భావాలను పంచుకోవాలని సూచించారు. విద్యార్థినులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలు మరియు ప్రతిజ్ఞ నిర్వహించారు. మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.



