NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దోమల నిర్మూల ప్రజల భాగస్వామ్య తోనే నిర్ములించకోగలం

1 min read

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యు.శోభ సూచన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దోమల నిర్మూల ప్రజల భాగస్వామ్య తోనే నిర్ములించగలమని , దోమల నిర్మూలించడం ద్వారా డెంగ్యూ రహిత సమాజం స్థాపించుకోవచ్చని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యు. శోభ సూచించారు. స్థానిక ఏలూరు లంబాడిపేట, నవాబ్ పేట లో జరుగుచున్న ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని      ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడుతూమాట్లాడుతూ వర్షాకాలంలో సాధారణంగా దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందని మంచినీటి నిల్వ ప్రాంతాలలో డెంగ్యూ దోమ, మలేరియా దోమ వృద్ధి చెందుతాయని, మురుగునీరులో  క్యూలెక్స్ దోమ  వృద్ధి చెందుతారని  మలేరియా జ్వరాలు కారణంగా గిరిజన ప్రాంతాల్లో  , డెంగు జ్వరాలు సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో మరియు పల్లపు ప్రాంతాలలో  సంభవిస్తాయని   డెంగ్యూ జ్వరము సాధారణమైన జ్వరం అని అశ్రద్ధ చేస్తే డెంగు జ్వరం ప్రాణాపాయమని, డెంగ్యూ దోమ పగటపూట                 కుడుతుందని  డెంగు కారక దోమ ఎడీస్ అనే పులి దోమ మంచినీటి నిల్వ ప్రాంతాలలైన మూతలు లేని నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు, పూల కుండీలు, నీటి బావులు, పంచినీటి నిల్వ ప్రాంతాలు, ఎయిర్ కూలర్స్ ఫ్రిడ్జ్ వెనక బాక్సు టైర్లు వాడేసిన కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ వస్తువులు పగిలిపోయిన కుండలు తదిత ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఇంటి లోపల ఇంటి బయట నీరు నిల్వ లేకుండా  ఫ్రైడే డ్రై డే పాటించాలని పనికిరాని వస్తువులు విసర్జించాలని నీటి నిల్వ ప్రాంతాలపై మూతలు పెట్టుకోవాలని డెంగ్యూ దోమ పగటిపూట కుడుతుంది కాబట్టి దోమ కాటు నుండి మనం సంరక్షించుకోవాలని జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఏలూరు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు కమీణా తగ్గుతున్నాయని దీనికి కారణం ప్రజల్లో అవగాహన రావడం వల్లనే అని సూచించారు అనంతరం ఇంటింటికి వెళ్లి డ్రమ్ములు ఫ్రిజ్లు ఇతర నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించి కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ  నిర్వహించారు, ఆరోగ్య కార్యకర్త నిర్వహిస్తున్న ఫ్రైడే యాప్, వెక్టర్ కంట్రోల్ యాప్  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లంబాడి పేట  పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్,  అసిస్టెంట్ మలేరియా అధికారి జే. గోవిందరావు,,   హెల్త్ అసిస్టెంట్స్, మేక శ్రీనివాసరావు, గోపాలకృష్ణ , ఆరోగ్య కార్యకర్తలు సృజన, స్వప్న,ఆశ కార్యకర్తలు రేణుక, బేబీ సరోజినీ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *