మేయర్ పీఠం… కూటమిదే..?
1 min read
చాణిక్య స్ర్టాటిజిస్ సర్వేలో వెల్లడి
- సంక్షేమం.. అభివృద్ధి కే పట్టం కట్టనున్న ఓటర్లు
- 68 వార్డులకుగాను దాదాపు 59 దక్కే అవకాశం..
- కూటమి ప్రభుత్వ పాలనతో మెరుగైన ఫలితాలు
- ఓటర్లను మెప్పించడంలో మంత్రి టిజి భరత్ సక్సెస్…
- అభ్యర్థుల కంటే… పార్టీ జెండా, మంత్రి టిజి భరత్ కే జై కొట్టనున్న ప్రజలు
- వైద్యులు, వ్యాపారులు, విద్యావంతులు, మేధావులు కూటమి వైపే…
- క్రాస్ ఓటింగ్..అంటూ దుష్ప్రచారం…
కర్నూలు, న్యూస్ నేడు : రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలో టీడీపీ జెండా ఎగరవేసేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కర్నూలు నగర మేయర్ పీఠం కూటమికే దక్కుతుందని ప్రముఖ చాణిక్య స్ర్టాటిజిస్ పొలిటికల్ సర్వే వెల్లడించింది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 68 వార్డులకుగాను దాదాపు 59 వార్డులు కూటమి దక్కించుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కర్నూలు నగరంలో 42 వార్డులు ఉండగా.. దాదాపు 38 నుంచి 40 వార్డులు, పాణ్యం పరిధిలో 22 వార్డులు ఉండగా 18 వార్డులు, కోడుమూరు పరిధిలో 4 వార్డులు ఉండగా 3 వార్డులు కూటమి కైవసం చేసుకుంటుందని సర్వేలో పేర్కొంది. కర్నూలు నగర మేయర్ పీఠం కూటమికే దక్కనుందని తెలిపింది.
సంక్షేమం.. అభివృద్ధే.. కీలకం..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు అవుతుండటంతో ప్రజలు కూటమికే జై కొట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ బాధితులు, కిడ్నీ బాధితులకు సకాలంలో పింఛన్లు ఇవ్వడం… ఉచిత బస్సు, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలతో పాటు రోడ్లు, కాల్వలు, విద్యుత్ స్తంభాలు వంటి ఎన్నో అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మెరుగైన ఫలితాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వైద్యులు .. వ్యాపారుల ప్రభావం..
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే హైదరాబాద్ తరువాత కర్నూలు జిల్లా హాస్పిటల్ హబ్ గా పేరుగాంచింది. ఇక్కడ దాదాపు హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్ తదితర వైద్య రంగానికి సంబంధించి వేల మంది ఉన్నారు. గత వైసీపీ హయాంలో పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని.. కూటమి ప్రభుత్వానికే జై కొట్టనున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. అంతేకాక రాజ్య సభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ , ఆయన తనయుడు రాష్ట్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ వైద్యులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. కర్నూలు నగరంలో వ్యాపారులు కూడా టిజి కుటుంబం నుంచి లబ్ధిపొందిన వారే అధికం. అభివృద్ధిని కాంక్షించే వైద్యులు, వ్యాపారులు, విద్యావంతులు, మేధావులు కూటమి పాలనకే మొగ్గు చూపుతారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కాంక్షిస్తున్నారు.
ఓటర్లు మెప్పించడంలో.. మంత్రి సక్సెస్…
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 68 వార్డుల్లో దాదాపు 4.50 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రతి వార్డులోనూ టిజి కుటుంబానికి సన్నిహితులు..బంధుత్వం..ఏదో ఒక రూపంలో సహకారం పొందిన వారే. దీంతో మంత్రి టిజి భరత్ సారథ్యంలో జరిగిన విస్తృత ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటికి తిరిగిన మంత్రి… వారి సమస్యలను సానుకూలంగా వింటూ… అక్కడికక్కడే కొన్నిటికి పరిష్కార మార్గాలు చూపారు. కర్నూలు నగరంలో జరిగిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజలకు వివరిస్తూ… వారి మన్ననలు పొందడంలో విజయం సాధించారనే చెప్పవచ్చు. మొత్తానికి మంత్రి టిజి భరత్ సారథ్యంలో కర్నూలు నగర మేయర్ పీఠం కూటమికే దక్కనుందని ఇంటలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
క్రాస్ ఓటింగ్… ఓ దుష్ప్రచారం..
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 68 వార్డులు ఉండగా అందులో కర్నూలుకు 42, పాణ్యం 22 వార్డులు, కోడుమూరు పరిధిలో 4 వార్డులు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులు నిలబడిన చోట ఒకరికొక్కరు సఖ్యత లేక గెలుపునకు సహకరించకపోవచ్చు. కులం, మతం అంటూ కొన్ని ఓట్లలో చీలిక వచ్చినా… మేయర్ అభ్యర్థికి మాత్రం కూటమికే ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో విద్యావంతులే అధికంగా ఉన్నారు. కార్పొరేట్ అభ్యర్థి ని కానీ, మేయర్ అభ్యర్థిని కానీ చూడకపోయినా… కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, అభివృద్ధిని మాత్రమే ప్రజలు చూస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


