పట్టణంలో తెదేపా జెండా ఎగరేస్తాం
1 min read
నందికొట్కూర్ ఎమ్మెల్యే గిత్త జయసూర్య..
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం టిడిపి పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ చైర్మన్ మరియు 32 వార్డుల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని పట్టణంలో ఎన్నడూ చేయనంతగా డ్రైనేజీ,నీటి సమస్య, సిమెంట్ రోడ్లు,రోడ్డు డివైడింగ్ లైటింగ్ తదితర పనులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వీటన్నిటినీ ప్రజలు చూస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని ఇంకా నందనవనంగా అభివృద్ధి చేస్తామని పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపై ఉంది.గతంలో శిలాఫలకాలు పెట్టే వారే కానీ ఏనాడు పట్టణాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.పట్టణ ఓటర్లు మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో లాయర్ జాకీర్ హుస్సేన్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మొల్లా రబ్బానీ, జాకీర్ హుస్సేన్,డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.


