NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశ ఐక్యతకు పటేల్ బలమైన పునాది!

1 min read

విద్యార్థులు ఉక్కు మనిషిని ఆదర్శంగా తీసుకోవాలి

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి, అధ్యాపకులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా నవీన పాటి మాట్లాడుతూ.. భారతదేశ తొలి ఉపప్రధానిగా, హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. మహాత్మా గాంధీ పిలుపుతో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న పటేల్, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు.దేశంలోని వందలాది సంస్థానాలను ఏకం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు, దేశ సమగ్రత కోసం చేసిన కృషి కారణంగా ప్రజలు ఆయనను ఉక్కు మనిషిగా గౌరవిస్తారని పేర్కొన్నారు.భారతదేశం అనేక భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని, ఆచారాలు, భాషలు వేరైనా మనమందరం భారతీయులమనే భావనతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని దృఢ సంకల్పంతో, పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనంతమ్మ, శంకరయ్య, ముస్తాక్, వెంకటరమణ, ఓబులేసు, మురళీమోహన్ గౌడ్, వెంకటేశ్వర్లు, సురేష్, మంజునాథ్, వన్నూర్, నాన్‌టీచింగ్ సిబ్బంది కృష్ణ, బషీర్, స్వామిదాస్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *