ఎల్లార్తిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఈరన్నకు మద్దతుగా ప్రచారం
1 min read
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి హరిజన ఈరన్నను గెలిపించండి – వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి
సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి హరిజన ఈరన్నకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి, యువ నాయకుడు దర్గప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి హరిజన ఈరన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్.కె. గిరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, మహిళలకు నెలకు రూ.1,800 ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3,000 భృతి వంటి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో అవి సూపర్ సిక్స్ కాదు.. డూపర్ సిక్స్‌గా మారాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిన కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరిజన ఈరన్నకు మద్దతు తెలపాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో సంక్రి రవి, మహేష్, వీరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.



