NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ స్థాయి స్కూల్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక లక్ష్మీపురం: చదరంగం పోటీల్లో రిడ్జ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు, కర్నూలు జిల్లాకు విశేష గుర్తింపు తీసుకొస్తున్నారు. రాష్ట్రస్థాయి అండర్-12 స్కూల్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్–2026లో రన్నరప్‌గా నిలిచిన రిడ్జ్ పాఠశాల జట్టు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది.ఆగస్టు 8, 9 తేదీలలో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-12 స్కూల్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రవ్యాప్తంగా 80 పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో రిడ్జ్ పాఠశాల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.రిడ్జ్ పాఠశాల నుండి బీ. షణ్ముఖ్, కే. గణేష్ కార్తికేయ, కే. మన్విత్ నాయక్, కే. రిశ్విత భాయ్, ఎం. జోషిత్ రెడ్డి ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కే. మన్విత్ నాయక్ బోర్డు నంబర్–1పై ఏడు రౌండ్లలోనూ విజయం సాధించి, 7కు 7 విజయాలతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవడం విశేషం.ఈ విజయంతో రిడ్జ్ పాఠశాల విద్యార్థులు నవంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న జాతీయస్థాయి స్కూల్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొననున్నారు. జాతీయస్థాయిలోనూ తమ ప్రతిభను చాటుకుని పాఠశాలకు, కర్నూలు జిల్లాకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడానికి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా పాఠశాల సీఈఓ జి. గోపీనాథ్ , కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్  మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో విద్యార్థులు సాధించిన విజయం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, పట్టుదలతో కూడిన నిరంతర సాధనే విజయానికి పునాదులని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందిస్తూ, వారిని రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దిన చెస్ కోచ్ ఎన్. ఇమామ్ హుస్సేన్ను  ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఏ. రాజ్‌కమల్ గారు, హెచ్‌ఓడీలు ఏ. నాగేంద్ర, ఎస్. శ్రీనివాసులు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *