స్వతంత్ర పోరు.. ప్రచార జోరు!
1 min read
హొళగుందలో జోరుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఏసీ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి – ఎమ్మార్పీఎస్ నేత పంచగుండ్ల వెంకటేష్
హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలో స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. హొళగుంద జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవింద గౌడ్, హొళగుంద నాలుగో ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి కే. కాశమ్మ తమ మద్దతుదారులు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.శనివారం హొళగుందలోని రాజానగర్ కాలనీ, రాళ్లచేను ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ నేత పంచగుండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసే నాయకులకు అవకాశం కల్పించాలని, ఏసీ (ఎయిర్ కూలర్) గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.జెడ్పీటీసీ అభ్యర్థి ఈడిగ గోవింద గౌడ్, ఎంపీటీసీ అభ్యర్థి కే. కాశమ్మ ఇద్దరికీ ఎయిర్ కూలర్ గుర్తు కేటాయించబడిందని, ఓటర్లు ఎలాంటి సందేహం లేకుండా ఏసీ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలిచిన వారు నాయకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు.ఈడిగ గోవింద గౌడ్‌కు ఉన్న రాజకీయ అనుభవం మండల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా ప్రజల కోసం పోరాడే నాయకత్వ లక్షణాలున్న కే. కాశమ్మను గెలిపిస్తే రాజానగర్ కాలనీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, జంగాల కాలనీ, శ్రీరామ్ నగర్ క్యాంప్, బుడబుక్కల కాలనీ తదితర ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందని పంచగుండ్ల వెంకటేష్ తెలిపారు.రోజురోజుకూ మండలంలో ఈడిగ గోవింద గౌడ్‌కు ప్రజల మద్దతు పెరుగుతోందని, ప్రజాభిమానంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన జెడ్పీటీసీ అభ్యర్థి ఈడిగ గోవింద గౌడ్, నాలుగో ఎంపీటీసీ అభ్యర్థి కే. కాశమ్మ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల అభిమానులు, మద్దతుదారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



