NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీటీసీగా గెలిపించండి..గ్రామాభివృద్ధికి కృషి

1 min read

కడుమూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం..

మిడుతూరు న్యూస్ నేడు: ఎంపిటీసీగా నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కడుమూరు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి దర్జీ షఫీ ఉల్లా అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామ నాయకులు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీసీ కాలనీ మరియు మైనారిటీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి మండల జడ్పిటిసి వైసిపి అభ్యర్థి డి రాజియాబి మరియు ఎంపీటీసీకి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.జగనన్న ప్రభుత్వం వస్తేనే ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయని వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు నేటికీ కనబడుతున్నాయని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కార్యదర్శి అన్వర్ భాష,మాజీ సర్పంచ్  హిదాయతుల్లా,ఉబేదుల్లా, ఫారుక్,కేశవరెడ్డి,కర్ణ, రామకృష్ణ,మాల మహానాడు ఎమ్మార్పీఎస్ నాయకులు రాజశేఖర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *