ఆదరించండి..అభ్యర్థులను ఆశీర్వదించండి
1 min read
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు
తలముడిపి రహిమున్నిసా,జలకనూరు సుభాషిణి,చింతలపల్లి రాజేశ్వరి,చెరుకుచెర్ల వెంకటలక్ష్మమ్మ..
మిడుతూరు న్యూస్ నేడు: వైసీపీ ఎంపిటిసి సభ్యులు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో వైసిపి ఎంపిటిసి అభ్యర్థులుగా బరిలో ఉన్న తలముడిపి-బంగి రహి మున్నిసా,జలకనూరు- సిరిగిరి సుభాషిణి, చింతలపల్లి-బుచ్చిరెడ్డి గారి రాజేశ్వరి,చెరుకుచెర్ల-గద్దల వెంకటలక్ష్మమ్మ ఎన్నికల బరిలో ఉన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూర్ వైసీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ సహకారంతో ఎన్నికల బరిలో ఉన్నామన్నారు. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు నేటికీ కనబడుతున్నాయని జగనన్న ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని ఈనెల 5వ తేదీన జరిగే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో జడ్పిటిసి అభ్యర్థి దూదేకుల రజియాభీ మరియు ఎంపిటిసి అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఓటర్లను ఎంపిటిసి అభ్యర్థులు కోరారు.


