అభివృద్ధే ధ్యేయంగా..స్వాగతించండి
1 min read
తెదేపా ఎంపీటీసీ అభ్యర్థులు చెరుకుచెర్ల రానెమ్మ,అలగనూరు స్వాములు,చింతలపల్లి సుజాత,తలముడిపి ఇస్రత్ లను గెలిపించండి..
మిడుతూరు న్యూస్ నేడు: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్దే ధ్యేయంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ బలపరిచిన జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులు అన్నారు.ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న చెరుకుచెర్ల గద్దల రానెమ్మ, అలగనూరు మిద్దె స్వాములు,తలముడిపి బంగి ఇస్రత్ మరియు జడ్పిటిసి అభ్యర్థి సంపంగి హైమావతి లను గెలిపించాలని వారు అన్నారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నర పాలనలో ఇచ్చిన హామీ మేరకు హామీలను నెరవేర్చిన ఘనత ప్రభుత్వానికి దక్కిందని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు.


