NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్,ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ రైడ్స్

1 min read

ఎక్సైజ్ సి.ఐ.పి.అశోక్

మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలని సూచన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాడిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్, ఏలూరు బి.శ్రీలత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌మెంట్), ఏలూరు కె.వి.ఎన్.ప్రభు కుమార్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి,ఏలూరు జిల్లా ఏ.ఆవులయ్య ఆదేశాల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ సిఐ భోగేశ్వర రావు మరియు ఈ.ఎస్.టి.ఎఫ్. ఎస్. ఐ.ఎం డి ఆరిఫ్ మరియు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఎక్సైజ్ నేరముల కొరకు జాయింట్ రైడ్స్ నిర్వహించగా  చింతలపూడి రేచర్ల గ్రామానికి చెందిన  జరబల రాము అను వ్యక్తికి సంబంధించిన నాటు సారాయి తయారీకి పనికి వచ్చు (50) లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఆ వ్యక్తి పై పరారీ కేసు నమోదు చేయడమైనదని ఒక ప్రకటనలో తెలిపారు.అలాగే ఈరోజు చింతలపూడి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించగా పోతురాజు శారద అను మహిళ వద్ద నుంచి (09) డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీన పరుచుకుని ఆ మహిళపై కేసు నమోదు చేయడమైనదని,అలాగే ఈ రోజు చింతలపూడి మండలంలో గల యర్రగుంటపల్లి గ్రామము లోని పోతురాజు శారద బెల్ట్ షాపు కేసు ఉన్నందున ఆ మహిళ ను చింతలపూడి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరచగా 129 BNSS(బిఎన్ఎస్ఎస్) చట్ట ప్రకారం బైండోవర్ బాండ్ విధించినారు. అలాగే ఈ రోజు చింతలపూడి మండలం లో గల పలు మద్యం దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మద్యం స్టాక్ ​ఎక్సైజ్ డిపో (APSBCL) నుండి వచ్చిన హోలోగ్రామ్/క్యూఆర్ కోడ్‌ లను కొన్ని మద్యం సీసాలు ఏ.పి.సురక్ష ఆన్లైన్ యాప్ ద్వారా సాధారణంగా పరిశీలించి,  మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలని సూచనలు ఉల్లంఘించరాదని,  సక్రమముగా పూర్తి నియమాలు/చట్టాలు పాటించవలసినదిగా మద్యం షాపులోని సేల్స్ సిబ్బందికి తెలిపినారు. ఈ దాడులలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ.లు అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు, ట్రైని ఎస్.ఐ. బి.ధనలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ. పి.అశోక్ తెలిపారు!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *