NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలపై 60 రోజుల మెగా డ్రైవ్​

1 min read

గుడిపాడు గ్రామాన్ని సందర్శించిన   జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి”

కర్నూలు,న్యూస్​ నేడు:  జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 11.11.2026 న  గూడూరు మండలం గుడిపాడు గ్రామం నందు జాతీయ న్యాయ సేవల పథకాల 60 రోజుల మెగా డ్రైవ్ పై అధికారులతో సమీక్షా నిర్వహించిన కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి. జాతీయ న్యాయ సేవల 13 పథకాలపై గుడిపాడు గ్రామం సచివాలయం నందు అధికారులతో చర్చించారు. ఈ  పథకాలను గ్రామంలోని ప్రజలకు అందేలా ఈ 60 రోజుల మెగా డ్రైవ్ లో చేస్తామని తెలిపారు.  ప్రతిరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు నియమించిన ప్యానల్ న్యాయవాదులు మరియు ప్యారా లీగల్ వాలంటీర్లు గుడిపాడు గ్రామాన్ని సందర్శించి ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించి వారికి ఆ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తారని  వారికీ తమ వంతు సహకారం అందించాలని అధికారులను కోరారు . ఈ కార్యక్రమంలో గూడూరు తాసిల్దార్ వెంకటేష్ నాయక్,  గుడిపాడు పంచాయతీ సెక్రటరీ సలీం, సచివాలయం అధికారులు,లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ప్యానల్ లాయర్  రాంపుల్లయ్య, ప్యారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *