NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు!

1 min read

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి – ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, దార్శనికుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.దేశంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలనే గొప్ప ఆశయంతో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేక విద్యా సంస్కరణలకు కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన సేవల ఫలితంగా భారతదేశ విద్యారంగ అభివృద్ధికి పటిష్టమైన పునాదులు ఏర్పడ్డాయని వివరించారు.విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి, దేశాభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటితో పాటు అధ్యాపకులు అనంతమ్మ, ముస్తాక్, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, వెంకటరమణ, ఓబులేసు, మురళీమోహన్ గౌడ్, శంకరయ్య, మంజునాథ్, వన్నూర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *