NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏలూరు జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన

1 min read

విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ప్రమాదాల నివారణ కు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ భద్రతా చర్యల పై ప్రత్యేక దృష్టి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రహదారి ప్రమాదంలో 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలిక బస్సు ప్రమాదంలో మరణించిన ఘటనను పురస్కరించుకొనిఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థుల సురక్షిత ప్రయాణం, రహదారులపై ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు,కాలేజీ విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం కొరకు వేచి ఉండేందుకు బస్సు షెల్టర్లు ఏర్పాట్లు పై అంశాలపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు వివిధ దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులు బస్సులు,ఇతర వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో వారి ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా విద్యార్థులను తరలించేందుకు ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయాలని  వాహనాల కండిషన్,డ్రైవర్ల బాధ్యతాయుతమైన డ్రైవింగ్, వేగ నియంత్రణ,బస్సులు ఆపాల్సిన ప్రదేశాలు, విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అదేవిధంగా ఏలూరు నగరంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి లోపాలను పరిశీలించడం, ప్రమాద సూచిక బోర్డులు, రహదారి భద్రతా సూచనలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏలూరు డిపో మేనేజర్ వాణి, డీటీసీ ఎస్.కె.కరీం,ఏలూరు డీఎస్పీ డి.శ్రవణ్ కుమార్, ఏలూరు త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు,ఏలూరు ట్రాఫిక్ సీఐ శ్రీ లక్ష్మణరావు,ఆర్ అండ్ బీ డీఈ శ్రీకర్,సి.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ఏలూరు డీటీఆర్‌బీ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *