బాల్య వివాహ నిర్మూలన అందరి బాధ్యత
1 min read
శిశు సంక్షేమ శాఖ సంరక్షణ అధికారి శ్రీనివాస్..
నందికొట్కూరు న్యూస్ నేడు: బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని శిశు సంక్షేమ శాఖ సంరక్షణ అధికారి కే శ్రీనివాస్ అన్నారు.నంద్యాల జిల్లా పగిడ్యాల కేజీబీవీ బాలికల పాఠశాలలో బుధవారంవివాహల నిర్మూలన గురించి అంగన్వాడీ సూపర్వైజర్ శేషమ్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ హాజరై బాలికలకు అవగాహన కల్పించారు.బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహ రహిత భారత్-100 రోజుల అవగాహన కార్యక్రమం 2026 అక్టోబర్ 21 నుండి డిసెంబర్ 21 వరకు నిర్వహిస్తున్నామని బాలల హక్కులు జీవించడం,రక్షణ,అభివృద్ధి భాగస్వామ్య హక్కుల గురించి బాలికలకు వివరించారు.ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుందని తెలిసిన చూసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098,పోలీస్ హెల్ప్ లైన్100,ఉమెన్ హెల్ప్ లైన్181 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అన్నారు. సోషల్ వర్కర్ నాగ జ్యోతి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి మరియు బాలికలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బాగా చదువుకోవాలని ఏమైనా సమస్యలు వస్తే వెంటనే టీచర్లకు చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాయత్రి, రెడ్స్ సంస్థ ప్రతినిధి షాజహాన్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


