NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘యూబిఐ’ 108 ఏళ్ల నమ్మకం..

1 min read

పురోగతి.. లక్ష్యంతో కొనసాగుతున్న బ్యాంకు..

  • సుస్థిర వృద్ధి.. యువతకు మెరుగై సేవలు..
  • యూనియన్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా రీజనల్​ హెడ్​ డి. అనిల్​ కుమార్​
  • బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కేక్​ కట్​ చేసిన ఉద్యోగులు

కర్నూలు, న్యూస్​ నేడు: బ్యాంకు ఖాతాదారులు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ… 108 సంవత్సరంలోకి అడిగిడుతున్న యూనియన్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా … సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ బ్యాంకు ఉమ్మడి కర్నూలు జిల్లా రీజనల్​ హెడ్​ డి. అనిల్​ కుమార్​ స్పష్టం చేశారు. 1919 నవంబరు 11న ముంబైలో స్థాపించిన  యూనియన్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా.. 2026 నవంబరు 11 నాటికి  108  సంవత్సరంలో అడుగు పెడుతున్న  సందర్భంగా  బుధవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. బ్యాంకు  రీజనల్​ హెడ్​​ డి. అనిల్​ కుమార్​ కేక్​ కట్​ చేసి  ఉద్యోగులకు, సిబ్బందికి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా రీజనల్​ హెడ్​. అనిల్​ కుమార్​ మాట్లాడుతూ  108 ఏళ్ల నమ్మకం, పురోగతి, లక్ష్యం అనే సందేశంతోపాటు  ‘ యూ బిఫోర్​ ఐ ’ అనే విలువకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.  అంతేకాక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, యువతకు మెరుగైన  బ్యాంకింగ్​ సేవలు అందించడం   సుస్థిర వృద్ధిని సాధించడంపై బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని వెల్లడించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతోపాటు బ్యాంకు ఖాతాదారులకు, ప్రజలకు, యువతకు, మహిళా పారిశ్రామిక వేత్తలకు మెరుగైన సేవలు అందిస్తోందని ఈ సందర్భంగా ఆర్​.హెచ్​. డి. అనిల్​ కుమార్​ పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *