NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు : నంద్యాల మండల పరిధిలోని అయ్యలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా కోశాధికారి డాక్టర్ అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. అరుణ కుమారి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ, సేవా భావం పెంపొందించేలా జిల్లాలోని ప్రతి పాఠశాలలోనూ జూనియర్ రెడ్ క్రాస్ బృందాలను ఏర్పాటు చేసి, వివిధ అవగాహన మరియు సేవా కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులను శ్రీకాకుళంలో నిర్వహించిన జూనియర్ రెడ్ క్రాస్ శిక్షణ కార్యక్రమాలకు ఎంపిక చేసి పంపినందుకు నంద్యాల రెడ్ క్రాస్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జూనియర్ రెడ్ క్రాస్ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆమె బహుమతులను అందజేశారు. అనంతరం అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) మరియు సీపీఆర్ (CPR) విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ అబ్దుల్లా, స్కూల్ కోఆర్డినేటర్ హుస్సేన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *