రాయలసీమను జీరో చేసి హీరోలవుతారా?
1 min read
సంస్థలు తరలిపోతున్నా మౌనమా? దూషణలు ఆపండి.. రాయలసీమ కోసం గళమెత్తండి – బొజ్జ దశరథ రామిరెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమకు దక్కాల్సిన పరిపాలనా ప్రాధాన్యతను, కార్యాలయాలను, జాతీయ స్థాయి సంస్థలను సాధించడంలో పాలకులు విఫలమవడమే కాకుండా.. ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను కూడా ఒక్కొక్కటిగా తరలిస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రాయలసీమ రాజకీయ నాయకులు మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. శుక్రవారం నంద్యాల సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..నాయకులు వ్యక్తిగత దూషణలు, ఆధిపత్య పోరాటాలతో కాలం గడుపుతూ ప్రాంత భవిష్యత్తును విస్మరిస్తున్నారని విమర్శించారు.
కర్నూలు మానవ హక్కుల కమిషన్‌ను ‘వారానికో ఊరు’ చేస్తారా?
కర్నూలులోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు ప్రజలు రావడం దూరమవుతుందనే కారణంతో వారానికో ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “మీ ఊరి నుంచి మా ఊరు ఎంత దూరమో.. మా ఊరి నుంచి మీ ఊరూ అంతే దూరం!” అన్న ఈ సాధారణ సత్యం ప్రభుత్వానికి తెలియదా? ఇదే సూత్రం రాయలసీమకు ఎందుకు వర్తించదు? అని నిలదీశారు. హైకోర్టు, సచివాలయం, శాసనసభ, కీలక కార్యాలయాలన్నీ సీమ ప్రజలకు దూరమేనని గుర్తుచేశారు.శాసనసభ సమావేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరగాలి, బడ్జెట్ సమావేశాలు రాయలసీమలో నిర్వహించాలనీ,సచివాలయ శాఖల కార్యాలయాలు రొటేషన్ పద్ధతిలో కర్నూలులో పనిచేయాలి, అనుబంధ కార్యాలయాలు సీమలో ఏర్పాటు కావాలి.విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికి మళ్లించారనీఅన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు మాని, ఉమ్మడి కార్యాచరణతో సమష్టిగా పోరాడాలని హితవు పలికారు. లేనిపక్షంలో సీమ ప్రజల హక్కులను విస్మరించే నాయకులకు తగిన రాజకీయ గుణపాఠం చెప్పే స్థాయికి రాయలసీమ సమాజం ఎదగాలని బొజ్జా పిలుపునిచ్చారు.


