NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు విద్యార్థుల సత్తా..

1 min read

అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో మెరిసిన క్రీడాకారులు

హేమంత్ కుమార్ రెడ్డికి గోల్డ్ మెడల్.. దినేష్‌కు బ్రాంజ్ మెడల్

విజేత క్రీడాకారులను ఘనంగా సత్కరించిన మంత్రి టీజీ భరత్

కర్నూలు, న్యూస నేడు: స్కాట్లాండ్‌లో నిర్వహించిన 12వ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో కర్నూలుకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం జిల్లా ప్రజలకు ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని పతక విజేతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం మొత్తం 23 పతకాలు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు మూడు పతకాలు లభించాయని తెలిపారు. ఇందులో కర్నూలుకు చెందిన హేమంత్ కుమార్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మరో క్రీడాకారుడు దినేష్ బ్రాంజ్ మెడల్ సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.క్రీడాకారుల విజయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకుని ఇటీవల వారిని కలిసే అవకాశం కల్పించానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రీడాకారులతో స్వయంగా మాట్లాడి వారి విజయాలను అభినందించారని చెప్పారు.గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రైజ్ మనీ ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు అందించే సర్టిఫికెట్లు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కర్నూలులో క్రీడా రంగ అభివృద్ధికి తాము ఎంతో కృషి చేస్తున్నామని, క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ పి. జగదీష్ కుమార్  ని  మంత్రి టి.జి. భరత్  ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల విజయాల వెనుక కోచ్ కృషి, అంకితభావాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో 61వ వార్డు కార్పొరేటర్ గాజుల విజయభాస్కర్ రెడ్డి, 62వ వార్డు కార్పొరేటర్ సురేంద్ర, సీనియర్ కరాటే మాస్టర్స్ హరీష్, గౌస్ బాషా, రమణ, ఫయాజ్, మునాఫ్, రాంబాబు, సురేంద్ర చిన్న తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *