NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లలకు చిన్న వయస్సు నుంచే మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచాలి

1 min read

సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పీడియాట్రిక్స్ విభాగంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం తగ్గించాలని, అధికంగా మొబైల్ ఫోన్లు, టీవీలు చూడటం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.పిల్లలు మొబైల్ ఫోన్లకు బదులుగా ఆటలు, పుస్తక పఠనం వంటి మంచి అలవాట్లను అలవర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.చిన్నారులు ప్రతిరోజూ పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలు చదువుతో పాటు ఆటలు, వ్యాయామం, ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని, మంచి అలవాట్లతో క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు  చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు, పుస్తకాలను అందజేసారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ తో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ డా లక్ష్మీ భాయ్ , పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ మరియు హెచ్.ఓ.డి డా సుహాసిని , రిటైర్డ్ ప్రొఫెసర్ డా జి.శారదా  మరియు పీడియాట్రిక్స్ విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *