కే.సాంబశివరెడ్డికి జడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి. .
1 min read
టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ కుమార్
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండల జడ్పిటిసిగా భారీ మెజార్టీతో ఎన్నికైన సాంబశివ రెడ్డికి కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ కుమార్ శనివారం నాడు ఒక ప్రకటనలో కోరారు. కే సాంబశివారెడ్డి జెడ్పిటిసి గ ఎన్నికైన సందర్భంగా ఆయనను టిఎన్టియుసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమం లో TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అశోక్ కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాల్ అలాగే బ్రహ్మయ్య, వెంకటేష్, జయన్న తదితరులు పాల్గొన్నారు..పత్తికొండ మండల జడ్పిటిసిగా గతంలో సాంబశివరెడ్డి ఎన్నో సేవలందించారని, పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేసిన అనుభవం ఆయనకు ఉందని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులుగా పార్టీ కార్యకర్తలకు పూర్తిస్థాయి అండగా అందుబాటులో ఉంటున్నారని గుర్తు చేశారు. కావున ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న పత్తికొండ మండల జడ్పిటిసి గా ఎన్నికైన కే సాంబశివారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చినట్లయితే సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


