బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
1 min read
చిన్నారుల సంక్షేమానికి సేవా కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబంధిత బాలల సంరక్షణ గృహంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు డీఎస్పీ శ్రీ మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆంధ్రా బ్యాంకు విశ్రాంత మేనేజర్ శ్రీ హెచ్. జనార్దన్ రెడ్డి రూ.14,730 విలువైన 7 కిలోల సామర్థ్యం గల హయ్యర్ వాషింగ్ మెషీన్ను బాలల గృహానికి విరాళంగా అందజేశారు. అలాగే రాయలసీమ ప్రాంత బాలల హక్కుల పరిరక్షణ సమన్వయకర్త (ఏపీ ప్రో చైల్డ్ కన్వీనర్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీ వై.ఎల్.ఎన్. దివాకర్ చిన్నారులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందిస్తూ, విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ మెం బర్ లయన్స్ జిల్లా చైర్పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరమైన చిన్నారులకు తగిన శిక్షణ అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, 1098 బాలల సహాయవాణి సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


