గ్రామంలో వీర జవాన్ కీర్తిశేషులు సిపాయి పి. అశోక్ కుమార్ విగ్రహావిష్కరణ
1 min read
చాగలమర్రి, న్యూస్ నేడు : నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్దవంగలి గ్రామంలో వీర జవాన్ కీర్తిశేషులు సిపాయి పి. అశోక్ కుమార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది.జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జై జవాన్ గ్రూప్ అధ్యక్షుడు కె. రామకృష్ణ ఆధ్వర్యంలో, గ్రూప్ సభ్యులు, జవాన్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.అనంతరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జై జవాన్ గ్రూప్ అధ్యక్షుడు కె. రామకృష్ణ మాట్లాడుతూ.. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్ త్యాగం మరువలేనిదని కొనియాడారు. కీర్తిశేషులు సిపాయి పి. అశోక్ కుమార్ కుటుంబానికి సైనిక్ సంక్షేమ శాఖ మరియు జై జవాన్ గ్రూప్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువకులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.


