NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గృహప్రవేశ వేడుకలో అభిమాన నాయకుడికి అపూర్వ స్వాగతం

1 min read

ముఖ్యఅతిథిగా హాజరైన అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

అన్నమయ్య జిల్లా నవంబర్ 15 (సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్ లో ఉన్న సరస్వతి నగర్ మాజీ కౌన్సిలర్ సహదేవ దంపతులు సోమవారం నూతన గృహప్రవేశ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో నృత్య కళాకారుల సందడి… డీజే పాటల హోరు… బాణసంచా వెలుగుల మధ్య ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించిన కొండ్రెడ్డి సహదేవ దంపతులు! రాయచోటి పట్టణంలోని సరస్వతినగర్‌లో మాజీ కౌన్సిలర్ కొండ్రెడ్డి సహదేవ – మల్లీశ్వరి దంపతులు నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుకకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు.తమ అభిమాన నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు విచ్చేసిన సందర్భంగా సహదేవ దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు నృత్య కళాకారులతో ఘన స్వాగతం పలికారు. డీజే పాటల హోరు, బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు కి ఘనంగా గజమాల వేసి, శాలువా కప్పి ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ బాబు సహదేవ దంపతులను, వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన గృహం సుఖసంతోషాలకు, సిరిసంపదలకు నిలయంగా మారాలని, ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.నాయకుడిపై అభిమానం… ఆతిథ్యంలో ఆప్యాయత…  సత్కారంలో ఆత్మీయత… ఈ వేడుకలో కొండ్రెడ్డి సహదేవ కుటుంబం చూపిన అభిమానానికి సుగవాసి ప్రసాద్ బాబు  ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ప్రజలతో మమేకమవుతూ… ప్రతి కుటుంబ శుభకార్యంలో భాగస్వాములవుతూ… అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుగవాసి ప్రసాద్ బాబు .ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *