అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి రెండవ విడత రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించాలి
1 min read
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు లను వెంటనే పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయాలి
ఐపీసీ చేనేత, ఓబీసీ ఛైర్మెన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి :అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి రెండవ విడత రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఎపి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి యస్ సవితమ్మ కి ఐపీసీ చేనేత, ఓబీసీ ఛైర్మెన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమా నికి ప్రత్యేక చర్యలు తీసుకో వాలని కోరారు. నేతన్న నేస్తం రెండవ సారి అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రతి ఏటా రూ. 25 వేలు ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా అందించాలని, మగ్గాల ఆధునీ కరణ, దారాలు, రంగుల కొనుగోలు కు ఈ సాయం ఉపయోగపడుతుందిని పేర్కొన్నారు.ఎన్టీఆర్ భరోసా పింఛను వయసు మీదపడిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను కింద ప్రతినెలా రూ. 4వేల అందిస్తు న్నారు. చేనేత రంగంలో అర్హత కలిగిన కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.


