రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన రిడ్జ్ పాఠశాల విద్యార్థులు..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఎన్.ఎస్.ఎం. జ్ఞానదత్త, పి. చేతన్ రెడ్డి అండర్-17 స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల సీఈఓ జి. గోపీనాథ్ గారు, కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.విద్యార్థులను ప్రతిభావంతులైన క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన క్రికెట్ కోచ్ ప్రేమ్ కుమార్ సింగ్ను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఎ. రాజ్ కమల్ , హెచ్ఓడీలు ఎ. నాగేంద్ర, ఎస్. శ్రీనివాసులు తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.


