జంక్ ఫుడ్స్ బదులు వీటిని తినండి
1 min readపల్లెవెలుగు వెబ్ : రోజూ ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ తినేవారు.. ఆ అలవాటు నుంచి దూరం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్స్ బదులు డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి వాటిని రోజులో ఏదో ఒకపూట తీసుకుంటే ఆరోగ్యం ఘనంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకుంటే పోషకాలు లభిస్తాయి. స్నాక్స్ బదులుగా కొన్ని బాదం గింజలు తింటే మలబద్ధకం దరిచేరదు. శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధ సమస్యలు రావు. చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి మంచిది. ఖర్జూరలో విటమిన్లు, మినరల్స్, న్యాచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. మలబద్ధకం రాకుండా రక్తహీనతను రాకుండా ఉంటుంది. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఎండుద్రాక్ష జీర్ణశక్తిని పెంచి, ఎసిడిటీ తగ్గించడంలో ఉపయోగపడుతుంది.