వృద్ధాప్య పింఛన్లు తొలగించడం..దారుణం: సీపీఐ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఎలాంటి కారణం లేకున్నా… జగనన్న పింఛన్లను తొలగించడం దారుణమన్నారు సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి, పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి. వృద్దాప్య. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న పింఛన్లు (వితంతు, వికలాంగ) ఆస్పరి మండలంలో వందలాది మందివి తొలగించడం అన్యాయమన్నారు. ఉపాధి పనులు లేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి కూలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఈ క్రమంలో రెండు మూడు నెలలకోసారి వచ్చి పింఛన్ తీసుకునే వారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల పింఛన్.. అదే నెలలో తీసుకోవాలని నిబంధన పెట్టి.. వెంటనే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. కొందరు స్థానికంగా ఉన్నా పింఛన్ తొలగించారని, సచివాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు పింఛన్లు తిరిగి మంజూరు చేయాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉరుకుంద ప్ప , వెంకటేశులు, శివ తదితరులు పాల్గొన్నారు.