PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘హిందూ’ మనోభావాలు గౌరవించాల్సిందే..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దేశంలో ప్రబలుతున్న కులాల,మతాల,వర్గాల, ప్రాంతాల విబేధాలను రూపుమాపి జాతిలో ఐక్యతను,సంఘటనా శక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గణేష్​ మహోత్సవాలను ప్రారంభించారని, కానీ ఏపీ ప్రభుత్వం కరోన బూచి చూపి.. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు విశ్వహిందూ పరిషత్ నగర కార్యాధ్యక్షులు గోరంట్ల రమణ. హిందూ మనోభావాలను గౌరవిస్తూ.. వెంటనే గణేష్​ మహోత్సవాలను కోవిడ్​ నిబంధనలతో కర్నూలు నగరంలో నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్​ పి. కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కర్నూలు, కర్నూలు అర్బన్​, కల్లూరు తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ,కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,రాష్ట్ర బజరంగ్దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి,రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,జిల్లా సంపర్క కన్వీనర్ గోవిందరాజులు, సహకార్యదర్శి శివప్రసాద్, బజరంగ్దళ్ విద్యార్థి కన్వీనర్ సాంబశివారెడ్డి,శేఖర్,మధు,తదితరులు పాల్గొన్నారు.

About Author