NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్యాస్ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదం

1 min read

సిబ్బందితో వాగ్వీదానికి దిగిన వినియోగదారులు

న్యూస్ నేడు హొళగుంద: భారత్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిబ్బందితో గ్యాస్వినియోగదారులు శనివారం వాగ్వీదానికి దిగారు. గ్యాస్ బుకింగ్ చేసినా తమకు బిల్లులు వస్తే ఇస్తామని సిబ్బంది చెప్పడంతో వినియోగదారులు భాషా, తహెర్బాషా తదితరులు గొడవకు దిగారు. ఇంటింటికి డోర్ డెలివరి చెయాల్సి ఉండగ రోడ్డు మీదకు వచ్చి ట్రాన్స్పోర్ట్ చార్ట్లో కలిసి డబ్బులు చెల్లించి గ్యాస్ తీసుకుంటున్నామని చెప్పారు. కాని తాము సెల్ఫోన్లో బుకింగ్ చేసుకున్నా కూడా ఏజెన్సీ వాళ్లు బిల్లులు ఇచ్చి ఉంటే గ్యాస్ ఇస్తామనడం సబబు కాదన్నారు. సిలెండర్లు ఇచ్చెంత వరకు కదిలేది లేదని చెప్పడంతో సిబ్బంది కొందరికి సిలెండర్లు ఇచ్చి వెళ్ళిపోయారు. ఏజెన్సీ వాళ్లు ఇచ్చే బిల్లుల ప్రమేయం లేకుండా బుకింగ్ చేసుకున్న అందరికీ సిలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

About Author