NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ ఉక్కుపై స్పష్టత ఇవ్వాలి

1 min read

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా ఏపీలోని ప్రజాప్రతినిధులు రాజీనామ చేస్తే టీడీపీ పోటీ ఉండదని తెలిపారు టీడీపీ నేత‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు. విశాఖ ఉక్కు విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రక‌ట‌న చేయ‌ల‌ని, నిర్మాత్మక కార్యచ‌ర‌ణ ప్రక‌టించాల‌ని కోరారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఢిల్లీలో పాద‌యాత్ర చేయాల‌ని.. విశాఖ‌లో కాద‌ని చెప్పారు. విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర చేస్తే.. క‌లిసిన‌డిచేందుకు తాము సిద్ధమ‌ని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోక‌పోతే.. చ‌రిత్రహీనుల‌వుతామ‌ని అన్నారు. ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడ ఉక్కు ఫ్యాక్టరీ విష‌యంలో స్పష్టమైన కార్యాచ‌ర‌ణ ప్రక‌టించి.. ప్రజా ఉద్యమంలోకి రావాల‌ని కోరారు.

About Author