జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలి
1 min read– వీసీలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
పల్లెవెలుగువెబ్, కర్నూలు: నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు– జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు వేగంగా జరగాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు కర్నూలు కలెక్టర్ పి. కోటేశ్వరరావు. గురువారం కలెక్టరేట్లోని వీసీలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌తోపాటు హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో వీసీలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో పేజ్ -1 లో 96,984 గృహలు మంజూరు అయ్యాయని, 73,280 లేవుట్ లో, ఓన్ సైట్/ పొజిషన్ సర్టిఫికేట్ 23,704 గృహాలు మంజూరయ్యాయిని, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో లేకుండా వచ్చే వారంలోపు పూర్తి చేయాలన్నారు. 22,121 ఇల్లు ఇంకా పనులు మొదలు పెట్టలేదని, బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్నవన్నీ బేస్మెంట్ లెవెల్ కు తీసుకురావాలన్నారు. ప్రతి రోజు మండలాల వారీగా ఎంత జియో ట్యాగింగ్ చేశారు, మ్యాపింగ్ ఎంత చేశారు, గ్రౌండింగ్ ఎంత చేశారు వంటి వివరాలను అందజేయాలని హౌసింగ్ పిడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లు హౌసింగ్ ప్రోగ్రాం పై వారంలో ఒకరోజు సంబంధిత ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. సమీక్షలో హౌసింగ్ పిడి వెంకటనారాయణ, మున్సిపల్ కమిషనర్ లు, ఆర్ డి ఓలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు, తహశీల్దార్ లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.