PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం ఛీఫ్​ అడ్వైజర్​గా…అదిత్యనాథ్​! రిటైర్డ్​ తర్వాత బాధ్యతలు

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా ప్రస్తుత ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్​ను నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్​ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన సేవలు ప్రభుత్వానికి అవసరమని భావించిన సీఎం వై.ఎస్​.జగన్​ ఛీఫ్​అడ్వైజర్​గా నియమించారు. కాగా సీఎస్​ అదిత్యనాథ్​ పదవీవిరమణ తర్వాత ప్రభుత్వం ఆయన స్థానంలో ఇప్పటికే కొత్త సీఎస్​గా సమీర్​శర్మను నియమించిన విషయం తెలిసిందే. అయితే అదిత్యనాథ్​ దాస్​ ఢిల్లీలోని ఏపీభవన్​ నుంచి సీఎం ఛీఫ్​అడ్వైజర్​గా తన విధులు నిర్వర్తంచనున్నట్లు తెలిసింది.

About Author