విద్యార్థులను గిరిజన ఆశ్రమ పాఠశాలకు తరలింపు..?
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: మహానందిలోని ఎయిడెడ్ పాఠశాలలోని ప్రైమరీ సెక్షన్లకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులను గిరిజన ఆశ్రమ పాఠశాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహానంది మండలం లోనాలుగు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి . పాఠశాలలో చదివే ప్రైమరీ సెక్షన్ల విద్యార్థులను ఆ పాఠశాల నుండి గిరిజన ఆశ్రమ పాఠశాల కు తరలించి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర చోట్ల కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డీఈవో కార్యాలయంలో ప్రైమరీ సెక్షన్ కు సంబంధించిన ఉపాధ్యాయులు రిపోర్టు చేసినట్లు తెలుస్తుంది .అక్కడ నుండి తాత్కాలికంగా బదిలీలు జరిగేంత వరకూ స్థానిక పాఠశాలలో ఉండాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఎయిడెడ్ .హైస్కూలు స్థాయిలో మాత్రం ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మరియు పాఠశాలను విలీనం చేయడానికి నిరాకరించినట్లు సమాచారం .ప్రైమరీ సెక్షన్లను కూడా కొందరు అధికారులు బలవంతంగా యాజమాన్యాలను నయానా భయానా ఒప్పించి ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయం నకు కు సరెండర్ చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు బలవంతంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేయడంతో భయపడిన యాజమాన్యాలు చేసేదిలేక సరెండర్ చేసినట్లు తెలుస్తుంది .అధికారులు తెలివిగా ఎవరైనా యాజమాన్యాలు కోర్టుకు వెళితే ప్రభుత్వ ధిక్కరణ కిందికి వస్తుందని ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హెచ్చరించి లనట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఒకవైపు హైకోర్టుమందలింస్తున్నా ఇవేమీ అధికారులకు పట్టినట్లు లేవని సమాచారం. మహానంది లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అరకొర సౌకర్యాలతో అవస్థలు పడుతున్న పరిస్థితి. అదనంగా విద్యార్థులు చేరుతారన్న ప్రచారంతో అక్కడి విద్యార్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారా లేక తాత్కాలిక ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నారని తెలియాల్సి ఉంది.