ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు!
1 min read

పల్లెవెలుగువెబ్, అమరావతి: ఏపీలో శుక్రవారం ప్రభుత్వ ఛీఫ్ సెక్రెటరీ డాక్టర్ సమీర్‌శర్మ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆయా ఐఏఎస్ అధికారులకు శాఖలను మార్చారు. సమీర్‌శర్మ ప్రభుత్వ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే పలువురు ఐఏఎస్ అధికారులకు శాఖలు మార్చడం గమనార్హం.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల్లో పౌరసరాఫరాల శాఖ కమిషనర్‌గా ఎం.గిరిజాశంకర్(2001వ బ్యాచ్), పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా కోన శ్రీధర్(2003), దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఎం.హరిజవహర్‌లాల్(1996), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా జి.ఎస్.నవీన్‌కుమార్(2007), నీటివనరుల శాఖ కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు(1997)కు ఆర్అండ్ఆర్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

