ఐదుగురి బధిరులకు టచ్ఫోన్స్ పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : దివ్యాంగులు, బధిరులు, వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు. శుక్రవారం కర్నూలు కలెక్టర్లోని జేసీ ఛాంబరులో దివ్యాంగులు, బధిరులు, వయోవృద్ధుల శాఖ ఏడీ విజయ నేతృత్వంలో అవసరమైన ఐదుగురి బధిరులకు జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు టచ్ఫోన్స్ అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్హులై ఉండి.. పథకాలు వర్తించని వృద్ధులు, దివ్యాంగులు, బధిరులు ఎవరైనా ఉంటే.. వెంటనే ఏడీ విజయ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.