పల్లెవెలుగు వెబ్:అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పోలీసులు రైతుల పై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయి విరిగింది. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధించి, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది.