భారీ వర్షాలపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష
1 min read
పల్లెవెలుగు వెబ్: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం చెన్నై నగరానికి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. రానున్న కొద్ది గంటల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులను మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు రూ.1000 చొప్పున పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ముంపు ప్రాంత ప్రజల తరలింపుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏం కావాలన్నా తక్షణమే అడగండి… అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్లకు సీఎం స్పష్టం చేశారు. ఒక ఫోన్ నెంబరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకుని చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
వాయుగుండం, బంగాళాఖాతం, సీఎం జగన్, రివ్యూ మీటింగ్ తాడేపల్లి, ఏపీ