కోహ్లీ ఆ రెండిటి నుంచి కూడా తప్పుకో: అఫ్రిది
1 min read
పల్లెవెలుగు వెబ్: విరాట్ కోహ్లీ టీ-20 కెప్టెన్‌గా తప్పుకోవడంపై పాక్ మాజీ అల్రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. మిగతా రెండు ఫార్మాట్లు టెస్ట్, వన్డే కెప్టెన్‌గా కూడా వైదొలగాలని సూచించాడు. ఇప్పటికే కోహ్లీ కెప్టెన్‌గా చాలా మ్యాచ్‌లు ఆడాడని.. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ బాధ్యతలను కూడా రోహిత్‌కే అప్పజెప్పాలని అభిప్రాయపడ్డాడు. రోహిత్ అద్భుత ఆటగాడని… అతడి ఆలోచనా విధానం అమోఘమన్నాడు. అవసరమైన చోట మాత్రమే దూకుడుతత్వాన్ని ప్రదర్శిస్తాడని, మిగతా సమయాల్లో కూల్‌గా ఉండటం హిట్ మ్యాన్ ప్రత్యేకత అని చెప్పుకొచ్చాడు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ దూకుడుగా ఉండాలో రోహిత్‌కు బాగా తెలుసన్నాడు. టీమిండియా కెప్టెన్సీ మార్పును తాను ముందే ఊహించానని.. ఆ అవకాశం రోహిత్‌కు ఇవ్వడం ఇదే సరైన సమయమని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కంటే మామూలు బ్యాటర్ గా బాగా రాణిస్తాడని అన్నాడు. ఇకపై జట్టు సభ్యుడిగా కొనసాగడం వల్ల విరాట్‌పై ఒత్తిడి తగ్గుతుందని.. దీంతో మంచి ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుందన్నాడు.