తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి
1 min readతాడిపత్రి: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా సరస్వతి ఎన్నికయ్యారు. ఉదయం తాడిపత్రి నగరపాలక కార్యాలయానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వేరు వేరు మార్గాలలో చేరుకున్నారు. భారీ కాన్వాయ్ తో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి రావడానికి యత్నించారు. అయితే.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు 18 మండి టీడీపీ కౌన్సిలర్లు, సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లు ప్రమాణస్వీకారానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా.. సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్ తో కలిపి జేసీ ప్రభాకరరెడ్డికి 20 మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది. దీంతో జేసీ ప్రభాకర రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. జేసీ ప్రభారరెడ్డి మాట్లాడుతూ తమ కౌన్సిలర్లు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి, ఝాన్సి లక్ష్మీ బాయిలు అంటూ .. వారి ధైర్యానికి హ్యట్సాఫ్ చెప్పారు. ఇక నుంచి తాడిపత్రిలో రౌడీయిజం, గూండాయిజం చెల్లవని తెలిపారు. తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.