జగన్ దిష్టిబొమ్మలకు బదులు.. చంద్రబాబును తగలబెట్టాలి !
1 min readపల్లెవెలుగు వెబ్ : సీఎం జగన్ దిష్టిబొమ్మలకు బదులు చంద్రబాబును తగలబెట్టాలి అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని టీడీపీ నుంచి గెంటేస్తే దరిద్రం వదిలిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సతీమణి పై వ్యాఖ్యలు చేసినట్టు టీడీపీ ఎమ్మెల్యేలు నిరూపించగలరా ? అంటూ ప్రశ్నించారు. ఏం వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు ఎందుకు చెప్పడంలేదని అన్నారు. అవమానించేలా మాట్లాడితే అప్పుడే చొక్కా పట్టుకోవాలి కదా అంటూ ప్రశ్నించారు. జగన్ ఎదుర్కోలేక ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు.