ఓటియస్ శాశ్వత గృహ హక్కు పత్రాల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండలం లోని పైపాలేంగ్రామానికి చెందినా మహేష్ ఒటీఎస్ శాశ్వత గృహ హక్కు పత్రం కొరకు పది వేల రూపాయలు చెల్లించినందున ఆయనకు గృహ హక్కు పత్రాన్ని మందల ప్రత్యేక అధికారి ఉమ దేవి మరియు ఎంపిడిఓ జి యన్ యాస్ రెడ్డి, తసిల్దర్ సిరజుద్దిన్ హౌసింగ్ ఏ ఈ శ్రీనివాసులు పంపిణి చేశారు. ఓ టి యస్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి తెలియజేశారు.మండలంలోని తలముడిపి గ్రామంలో ఓటి ఎస్ శాశ్వత గృహ హక్కు పత్రము కొరకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు పదివేల రూపాయలు చెల్లించి నందున ఆయనకు శాశ్వత గృహ హక్కు పత్రమును ఈవోఆర్డి పుల్లయ్య గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అలగనూరు గ్రామంలో బషీరున్ బీ 2008- 2009 సంవత్సరంలో గృహనిర్మాణ సంస్థ నుండి 27 వేల 240 రుణం తీసుకుంది .ఈ పథకం ద్వారా వన్టైమ్ సెటిల్మెంట్ కింద పదివేల రూపాయలు చెల్లించింది. మిగతా 17240 రూపాయలు మాఫీ అయినది. ఈమెకు శాశ్వత గృహ పత్రమును పంచాయతీ కార్యదర్శి అనురాధ హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అంజాద్ బాషా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పైపాలేం గ్రామ సర్పంచ్ మర్రి రామ చంద్రుడు, పంచాయితి కార్యదర్శి రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ భాష, మర్రి రామేశ్వరుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రూపేస్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.