NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి శాస్త్రోక్తంగా పూజలు

1 min read

భక్తుల సౌకర్యార్థం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

వివిధ సేవలు రూపేణారూ:1,62,643/-లు ఆదాయం

పర్యవేక్షించిన కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :గురవాయిగూడెం గ్రామములో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద  ప్రతి  శనివారం నిర్వహించు అభిషేక సేవ సందర్భముగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈరోజు శలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని  ఈ కార్యక్రమములలో   పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్ధం  ఆలయము వద్ద  ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు.మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల  ద్వారా      రూ 1,62,643/-లు  సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో  అధిక సంఖ్యలో భక్తులు  అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీస్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగిన ఏర్పాట్లుఆలయకార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన పర్యవేక్షించినట్లు తెలిపారు.

About Author