పెళ్లి వేడుకల ప్రసారానికి.. 100 కోట్లు ఆఫర్ !
1 min readపల్లెవెలుగు వెబ్ :బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా, విక్కీ కౌశల్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. డిసెంబర్ 9న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ భర్వారాలో వీరి వివాహం జరగనుంది. అయితే.. వివాహ వేడుకలో ఎలాంటి ఫోటోలు, సెల్ఫీలు తీయొద్దంటూ అతిథులకు నిబంధనలు విధించారు. దీనికి కారణం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్. కత్రినా పెళ్లికి సంబంధించిన వీడియో ప్రసార హక్కుల కోసం ఆ ఓటీటీ సంస్థ 100 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. అయితే.. కత్రినా జంట ఈ డీల్ కు ఇంకా ఓకే చెప్పలేదు. ఒకవేళ కత్రినా ఓకే చెబితే.. ఓటీటీలో కత్రినా పెళ్లి వేడుకలు లైవ్ టెలికాస్ట్ అవుతాయి.